Tirumala: వజ్రం పోయిన విషయాన్ని రమణదీక్షితులు నిన్నటివరకూ ఎందుకు బయటపెట్టలేదు?: ఖాద్రిపతి నరసింహాచార్యులు

  • శ్రీవారి వజ్రం 2001లో పోయిందని రమణదీక్షితులన్నారు
  • నాడు శ్రీవారి ఆభరణాలను టీటీడీకి అప్పగించింది రమణదీక్షితులే
  • కైంకర్యాలలో ఎలాంటి అపచారం జరగడం లేదు

తిరుమల శ్రీవారి వజ్రం 2001లో పోతే నిన్నటి వరకు ఆ విషయాన్ని పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఎందుకు బయటపెట్టలేదని సీనియర్ అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు ప్రశ్నించారు. రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విురాశి వ్యవస్థ రద్దయినప్పుడు ఆభరణాలు టీటీడీకి అప్పగించింది రమణదీక్షితులేనని, స్వామి వారికి కైంకర్య సేవలు చేసే వారిని ఆయన అవమానించారని అన్నారు. రమణదీక్షితులకు బ్రాహ్మణ సంఘాలు మద్దతివ్వడం బాధాకరమని అన్నారు. ఉద్యోగ విరమణ తప్పనిసరి అని, శ్రీవారి ఆలయంలో కైంకర్యాలలో ఎలాంటి అపచారం జరగడం లేదని అన్నారు.

కాగా, టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి కైంకర్య సేవలు ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని, శిథిలావస్థకు చేరుకున్నందువల్లే పోటుకు మరమ్మతులు చేశారని చెప్పారు. తిరుమల శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసేలా రమణదీక్షితులు ఆరోపణలు చేశారని అన్నారు. 2001లో పోటు మరమ్మతులు చేస్తుంటే వేరే ప్రాంతంలో ప్రసాదాలు తయారు చేసేందుకు ఆయనే అంగీకరించారని చెప్పారు. ఆర్కియాలజీ అధికారులకు తిరుమల ఆలయాన్ని ఎందుకు అప్పగించాలని ప్రశ్నించారు. రమణదీక్షితులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News