Tirumala: అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారో!: రమణదీక్షితులు

  • ఈ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారో నాకు తెలియదు
  • తిరుమల శ్రీవారి నగల గురించి నలుగురు అర్చకులకే తెలుసు
  • ఆ నలుగురిని తొలగిస్తే ఇక అడిగే వారుండరనుకుంటున్నారు!

తిరుమల శ్రీవారికి చెందిన అత్యంత విలువైన గులాబీ వజ్రం అంశంపై పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవో అశోక్ సింఘాల్ ప్రెస్ ఏర్పాటు చేసి రమణదీక్షితులపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం, మీడియాతో రమణదీక్షితులు మాట్లాడుగూ, ఈ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారో తనకు తెలియదని చెప్పారు.

 తిరుమల శ్రీవారికి సంబంధించిన నగల గురించి కేవలం నలుగురు అర్చకులకు మాత్రమే తెలుసని, మమ్మల్ని తొలగిస్తే ఆ నగలు గురించి అడిగే వారే ఉండరనే ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ తీరు ఇలాగే ఉంటే, భవిష్యత్తులో ఇక్కడ ఓ గుడి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పోటును మూసివేసిన సంఘటనపై, స్వామి వారి నగలకు సంబంధించిన వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు.
 
పోటును ఎందుకు మూసివేశారు?

నాలుగు బండలను తొలగిచండానికి 22 రోజుల పాటు పోటును ఎందుకు మూసివేశారని రమణదీక్షితులు ప్రశ్నించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, బండలు తొలగించాల్సిన అవసరమేమొచ్చిందని, అసలు, వాటి కింద ఏమున్నాయని ప్రశ్నించారు. తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని, ఈ ప్రసాదాల తయారీని భక్తులు చూడకూడదని, కేవలం వాటిని తయారు చేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే పర్యవేక్షించాలని అన్నారు. తిరుమల శ్రీవారిని పస్తులుంచడం ఆగమశాస్త్రాలకు విరుద్ధమని చెప్పారు.

  • Loading...

More Telugu News