YSRCP: మా కుటుంబంలో ఆత్మీయుడిని కోల్పోయాం: జగన్ సతీమణి భారతి

  • సోమయాజులు భౌతికకాయానికి భారతి నివాళులు
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలి
  • నేటి తెల్లవారుజామున మరణించిన సోమయాజులు

వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మరణంతో తమ కుటుంబంలో ఓ ఆత్మీయుడిని కోల్పోయినంత బాధ కలుగుతోందని వైకాపా అధినేత వైఎస్ జగన్ సతీమణి, సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సోమయాజులు నివాసానికి వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె, ఆపై మాట్లాడుతూ, సోమయాజులు మరణం తీరని లోటని అన్నారు.

ఆయన మృతి వార్త తెలుసుకుని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ తెల్లవారుజామున సోమయాజులు అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వైఎస్‌ హయాంలో ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన సోమయాజులు, గతంలో అగ్రికల్చర్‌ టెక్నాలజీ విభాగానికి డిప్యూటీ ఛైర్మన్‌ గా సేవలందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించారు.

YSRCP
Somayajulu
Jagan
YS Bharati
  • Loading...

More Telugu News