Karnataka: కర్ణాటకలో అధికారం పంపిణీపై కాంగ్రెస్, జేడీఎస్ మధ్య నేడు కీలక చర్చలు

  • రాహుల్ తో చర్చించనున్న అజాద్, గెహ్లాట్
  • అటు బెంగళూరులోనూ ఇరు పార్టీల నేతల భేటీ
  • 23న సీఎంగా కుమారస్వామి ప్రమాణం, డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీకి

కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ తో అధికార పంపిణీపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈ రోజు ఢిలీల్లో సమాలోచనలు జరపనున్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఈ నెల 23న (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బయటి నుంచి మద్దతిస్తామని ముందు కాంగ్రెస్ ప్రతిపాదించగా, ప్రభుత్వంలో చేరాలని దేవెగౌడ కాంగ్రెస్ ను కోరారు. దీనికి కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో రెండు పార్టీల భాగస్వామ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

అయితే, ఎవరికి ఎన్ని పదవులు, ఎవరికి అవకాశం ఇవ్వాలి? తదితర అంశాలపై రాహుల్ సమక్షంలో చర్చలు జరగనున్నాయి. కర్ణాటక అంశాలపై పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ అజాద్, అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. అన్ని అంశాలు రాహుల్ సమక్షంలో తేలిపోనున్నాయని పార్టీ నేత ఒకరు తెలిపారు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, జనతాదళ్ (సెక్యులర్) నేతలు కూడా బెంగళూరులో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం పదవిని కాంగ్రెస్ పార్టీ దళిత నేతకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News