Pawan Kalyan: తన వీరాభిమాని బైక్ పై పవన్ కల్యాణ్!

  • పవన్ వీరాభిమాని భాను ప్రసాద్
  • పవన్ కోసం బైక్ ను మార్చిన భాను
  • కాసేపు ముచ్చటించిన జనసేనాని

భాను ప్రసాద్... విజయవాడకు చెందిన ఈ వ్యక్తి, పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఎంత అభిమాని అంటే, పవన్ ఎక్కడ రాజకీయ పర్యటనలకు వెళ్లినా, తన రివెంజర్ బైక్ తో భాను ప్రసాద్ ప్రత్యక్షమవుతాడు. తన బైక్ ను చూస్తే జనసేన పార్టీ గుర్తొచ్చేలా స్టిక్కర్లు, పవన్ ముఖచిత్రంతో ఆలంకరించి, అందరినీ ఆకర్షిస్తుంటాడు. అంతేకాదు, తన గుండెలపై పవన్ పచ్చబొట్టును పొడిపించుకున్న భాను ప్రసాద్, తన అభిమాన నేత మరింత ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నట్టు చెబుతుంటాడు.

ఇక భానుప్రసాద్ కు స్వీట్ షాకిచ్చారు పవన్. అతని రివెంజర్ బైక్ ను పరిశీలించడంతో పాటు కాసేపు దానిపై ఎక్కి కూర్చున్నారు. భాను ప్రసాద్ తో కాసేపు ముచ్చటించారు. ఇక తన అభిమాన స్టార్ తనకోసం కొంత సమయాన్ని గడుపుతారని ఊహించని భాను, ఈ ఘటనను తన జీవితంలో ఎన్నడూ మరచిపోనని ఆనందంగా చెబుతున్నాడు.

Pawan Kalyan
Jana Sena
Bike
  • Loading...

More Telugu News