Karnataka: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఈరోజే?

  • రాజ్‌భవన్‌కు వెళ్లిన యడ్యూరప్ప
  • ఈరోజే కుమారస్వామికి గవర్నర్‌ నుంచి పిలుపని వార్తలు
  • కాంగ్రెస్‌-జేడీఎస్‌కు 117 ఎమ్మెల్యేల బలం

కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు యడ్యూరప్ప తన నిర్ణయాన్ని ప్రకటించి రాజ్‌భవన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సీఎంగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి ఎన్నో విమర్శలు ఎదుర్కున్న ఆ రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఇక కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనున్నారు. ఇక ఈ రోజే ఆయనను గవర్నర్ పిలుస్తారని, నేడే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు 117 ఎమ్మెల్యేల బలం ఉంది.    

Karnataka
kumara swamy
Congress
  • Loading...

More Telugu News