Karnataka: యడ్డీ రాజీనామా వార్తలను ఖండించిన బీజేపీ నేతలు!

  • ఈ వార్తల్లో నిజం లేదు
  • యడ్డీ తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు
  • స్పష్టం చేసిన బీజేపీ నేతలు

కర్ణాటక అసెంబ్లీలో ఈరోజు సాయంత్రం బలపరీక్షకు బీజేపీ దిగనుంది. అయితే, సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తున్నామని, యడ్డీ తన పదవికి రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఈ విషయమై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.

 కాగా, కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే నిమిత్తం బీజేపీ నేతలు యడ్యూరప్ప, యడ్యూరప్ప కొడుకు, శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి యత్నిస్తున్నారనే ఆరో్పణలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి.

  • Loading...

More Telugu News