Chandrababu: ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ముందుకు వెళ్తున్నాం: చంద్రబాబు
- రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- సంతృప్తికరంగా పనులు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి
- ఇతర ప్రాంతాలతో పోల్చితే రాజధానిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గేలా మొక్కల పెంపకం
రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఆరు నెలల్లో వీటిపై ఒక అవగాహన ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ముందుకెళుతున్నామని తెలిపారు.
రాజధాని నిర్మాణ పనులు వేగంగా, సంతృప్తికరంగా జరుగుతున్నాయని, మరింత శ్రద్ధ పెట్టి త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇతర ప్రాంతాలతో పోల్చితే రాజధాని నగరంలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గేలా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి పరిశీలించిన ప్రాంతాలు:
- మందడంలో నిర్మిస్తున్న గృహ సముదాయాల సందర్శన
- మందడం సమీపంలోని సీడ్ యాక్సెస్ 8 రోడ్ల రహదారిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల పరిశీలన
- అల్పాదాయ వర్గాల కోసం చేపట్టిన 5వేల భవనాల నిర్మాణ పనులు
- రాయపూడి లో నిర్మిస్తున్న ఐఏఎస్, మంత్రుల గృహ సముదాయాలు
- ల్యాండ్ పూలింగ్‌కు చెందిన 13 లేఔట్‌లలో పనులు ప్రారంభమైన 6 లేఔట్ల పరిశీలన
- నేలపాడు గ్రామంలో నిర్మాణంలో ఎన్జీఓల 1980 ఇళ్ల నిర్మాణం, సెక్రటేరియట్, నాల్గవ తరగతి ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణాలను, నమూనాలను, డిజైన్ల పరిశీలన
- అమరావతి రాజధాని పరిధిలో మొత్తం దాదాపు 320 కి.మీ. మేర 32 రహదారులు