gmail: జీమెయిల్ కు అంతరాయం... యూజర్లకు కష్టాలు!
- డెస్క్ టాప్ బ్రౌజర్ లో ఓపెన్ కాని జీ మెయిల్
- ఇప్పటికే లాగిన్ అయి ఉన్న వారికి సమస్య లేదు
- ఆండ్రాయిడ్ డివైజెస్ లోనూ పనిచేస్తున్న జీమెయిల్
టెక్నాలజీలో మేటి అయిన గూగుల్ ఆధ్వర్యంలో జీమెయిల్ కు సాంకేతిక అవరోధాలు ఎదురయ్యాయి. భారత్ లో ని యూజర్లకు ఈ రోజు జీ మెయిల్ చుక్కలు చూపిస్తోంది. లాగిన్ అయ్యే పరిస్థితి లేదు. ఆండ్రాయిడ్ డివైజెస్ లో లాగిన్ అయిన వారికి, లాగిన్ అవ్వాలనుకునే వారికి సమస్య లేదు కానీ, డెస్క్ టాప్ బ్రౌజర్ నుంచి మాత్రం జీమెయిల్ లాగిన్ సమస్యలు నెలకొన్నాయి.
ఉదయం ఎటువంటి సమస్యా లేదు కానీ, తర్వాతే ఇది నెలకొని ఉంది. ఉదయమే లాగిన్ అయిన ఉన్న వారికి జీమెయిల్ యథావిధిగా పనిచేస్తోంది. ఎంత ప్రయత్నించినప్పటికీ ‘దిస్ సైట్ కెన్ నాట్ బి రీచ్డ్, సర్వర్ ఐపీ అడ్రస్ కుడ్ నాట్ బి ఫౌండ్’ అన్న సందేశం వస్తోంది. దీనిపై గూగుల్ ఇంకా ప్రకటన జారీ చేయలేదు. జీ మెయిల్ కు ఏమైందోనన్న సందేహం యూజర్లలో నెలకొంది.