: మంత్రులు ఇద్దరు.. మధ్యలో చిరు!


సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు.. ప్రజారాజ్యం పార్టీ స్థాపన నుంచి అది కాంగ్రెస్ లో విలీనం అయ్యేవరకు చిరంజీవి వెంట నడిచిన నాయకులు, ప్రస్తుతం మంత్రులు. వీళ్ళిద్దరూ ఇప్పుడు భిన్నమైన వాదనలతో వార్తల్లో వ్యక్తులయ్యారు. సి. రామచంద్రయ్య దూకుడు ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికల్లో చిరంజీవే సీఎం అభ్యర్థి అని చెబుతోండగా, ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు.

చిరంజీవికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన్నీ సీఎం చేస్తే తప్పేంటని రామచంద్రయ్య ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి మంచి వ్యవహారకర్తగా పేరు తెచ్చుకున్నారని, అయినా, ఆయన సేవలు రాష్ట్రంలో తగు రీతిలో వినియోగించుకోలేకపోతున్నారని రామచంద్రయ్య అన్నారు. ఈ విషయమై గంటా స్పందిస్తూ, ప్రస్తుత సీఎం కిరణ్ బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారని, ప్రస్తుత తరుణంలో సీఎం మార్పు అవసరంలేదని అభిప్రాయపడ్డారు. మంచి పథకాలతో సీఎం ప్రజల్లోకి చొచ్చుకు వెళుతున్నారని గంటా వివరించారు.

  • Loading...

More Telugu News