karnataka: బలపరీక్ష రేపే.. కర్ణాటక బీజేపీ ప్రభుత్వానికి షాక్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
- రేపు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష
- మరింత సమయం కావాలని కోరిన బీజేపీ న్యాయవాది రోహత్గీ
- రోహత్గీ విన్నపాన్ని తిరస్కరించిన ధర్మాసనం
దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక రాజకీయ భవితవ్యం రేపు తేలిపోనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
విశ్వాస పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని బీజేపీ తరపు న్యాయవాది రోహత్గీ సుప్రీం ధర్మాసనాన్ని కోరినప్పటికీ... ఆయన కోరికను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రేపు బలపరీక్షను ఎదుర్కోవడానికి మీకున్న అభ్యంతరాలు ఏమిటని ఈ సందర్భంగా రోహత్గీని ధర్మాసనం ప్రశ్నించింది. బలపరీక్షను రేపు ఎదుర్కోవాల్సిందేని ఆదేశించింది.
మరోవైపు, బలపరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టును రోహత్గీ కోరారు. దీన్ని కూడా దర్మాసనం తిరస్కరించింది. చేతులను పైకి ఎత్తడం ద్వారా ఎమ్మెల్యేలు తమ మద్దతును తెలపాలని... ఎమ్మెల్యేల సంఖ్యను ప్రొటెం స్పీకర్ లెక్కించాలని స్పష్టం చేసింది.