prakash javadekar: కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఫన్నీ వాదనలు చేస్తోంది: కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్

  • కాంగ్రెస్‌ పార్టీకి రూల్స్‌ పట్ల అవగాహన లేదు 
  • తమ ఎమ్మెల్యేలపై నమ్మకం కూడా లేదు
  • అందుకే వారిని రిసార్ట్‌లలో ఉంచారు

కర్ణాటకలో బీజేపీ అప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని దేశంలోని పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం యడ్యూరప్పకు ఇచ్చిన నేపథ్యంలో వస్తోన్న విమర్శలపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్ స్పందించారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తాము నియమాల ప్రకారమే కర్ణాటకలో ముందుకు వెళుతున్నామని, కాంగ్రెస్‌ పార్టీకి రూల్స్‌ పట్ల అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ఫన్నీ వాదనలు చేస్తోందని అన్నారు. అలాగే, కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల అధిష్ఠానాలకు తమ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని, అందుకే వారిని రిసార్ట్‌లలో ఉంచారని చురకలంటించారు. ఆ రెండు పార్టీలకు భయం పట్టుకుందని జవదేకర్‌ అన్నారు.

prakash javadekar
Karnataka
Congress
  • Loading...

More Telugu News