vijay devarakonda: నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ

  • 'టాక్సీవాలా'తో రెడీగా విజయ్ దేవరకొండ 
  • 'గీత గోవిందం' కూడా దాదాపు పూర్తి 
  • త్వరలో సెట్స్ పైకి 'డియర్ కామ్రేడ్'

విజయ్ దేవరకొండ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. త్వరలో 'టాక్సీవాలా' .. 'గీత గోవిందం' సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక ఆయన తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆల్రెడీ ఆయన క్రాంతి మాధవ్ కి .. నందినీ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వున్నాడు. ఎవరి సినిమాను ముందుగా మొదలెట్టాలనే విషయంలో ఆయన బాగా ఆలోచించి , ముందుగా నందినీ రెడ్డి సినిమానే చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్ .. ప్రియాంక దత్ లు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఒక వైపున 'డియర్ కామ్రేడ్' చేస్తూనే మరో వైపున నందినీ రెడ్డి ప్రాజెక్టును కూడా విజయ్ దేవరకొండ పూర్తిచేయనున్నాడన్న మాట.  

vijay devarakonda
nandini reddy
  • Loading...

More Telugu News