yeddyurappa: తొలి సంతకంతోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి యడ్యూరప్ప

  • రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేసిన యడ్డీ
  • రూ. 56 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ
  • రైతులకు సంఘీభావంగా పచ్చ కండువా కప్పుకున్న యడ్యూరప్ప

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు యడ్యూరప్ప. రూ. 56 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తూ సీఎంగా తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రైతులకు సంఘీభావంగా ఆయన పచ్చ కండువా కప్పుకున్నారు. దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు... ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయన చెప్పారు. మరోవైపు, బలనిరూపణ కోసం యడ్డీకి కర్ణాటక గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో కేబినెట్ కొలువుతీరిన తర్వాత ఆయన మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

yeddyurappa
karnataka
first signature
  • Loading...

More Telugu News