West Bengal: పశ్చిమబెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ ప్రభంజనం

  • 1,800 స్థానాల్లో తృణమూల్ ముందంజ
  • సీపీఎం, బీజేపీ 100 చోట్లే ఆధిక్యం
  • రాత్రికి స్పష్టమైన ఫలితాలు

పశ్చిమబెంగాల్లో తనకు తిరుగులేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిరూపించారు. రాష్ట్రంలో ఈ నెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ సంఖ్యలో స్థానాలను గెలుచుకోనుందని ఫలితాలు తెలియజేస్తున్నాయి. 621 జిల్లా పరిషత్ లు, 6,123 పంచాయతీ సమితులు, 31,802 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల జరగ్గా ఈ రోజు కౌంటింగ్ జరుగుతోంది.

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ను పర్యవేక్షిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ 1,800 గ్రామ పంచాయతీల్లో ముందుంది. సీపీఎం, బీజేపీ కేవలం 100 సీట్లలోనే ముందున్నాయి. రాత్రికి గానీ పూర్తి ఫలితాలు తెలిసే అవకాశం లేదు.

  • Loading...

More Telugu News