trisha: త్వరలోనే త్రిష పెళ్లంటూ కోలీవుడ్ లో గుసగుసలు

  • తమిళంలో వరుస సినిమాలతో త్రిష 
  • ఇటీవలే స్నేహితులతో కలిసి భారీగా షాపింగ్ 
  • ఆ విషయంపై కొందరి ఊహాగానాలు   

గతంలో త్రిష పెళ్లి .. పీటల వరకూ వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఆమె కెరియర్ పైనే దృష్టి పెట్టింది. ఈ కారణంగానే తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. అలాంటి త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఇటీవల స్నేహితులతో కలిసి త్రిష విదేశాలకి వెళ్లి వచ్చింది. అక్కడ ఆమె భారీస్థాయిలో షాపింగ్ చేసిందని అంటున్నారు.

 ఆ షాపింగ్ ఏదో సరదాగా చేసినట్టుగా లేదట .. అందువలన కచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగేనని చెప్పుకుంటున్నారు. త్రిష కొంతకాలంగా ఒక బిజినెస్ మేన్ తో చనువుగా వుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రిష తల్లి మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తూనే వస్తోంది. ప్రస్తుతం త్రిష పూర్తి చేయవలసిన సినిమాలు మూడు వరకూ వున్నాయట. అవి పూర్తి కాగానే పెళ్లి సంగతి బయటికి చెప్పనుందని అంటున్నారు. అప్పటివరకూ వరుడు ఎవరనే సస్పెన్స్ ను భరించక తప్పదు.   

  • Loading...

More Telugu News