Yedeyurappa: 'యడ్యూరప్ప అనే నేను...' ఆర్భాటం లేకుండా ముగిసిన ప్రమాణ స్వీకారం తంతు!

  • ముందు చెప్పినట్టుగానే యడ్డీ ప్రమాణ స్వీకారం
  • ప్రమాణం చేయించిన గవర్నర్
  • హాజరైన కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు

యడ్యూరప్ప తన కోరికను నెరవేర్చుకున్నారు. ముందు చెప్పినట్టుగానే నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. "బీఎస్ యడ్యూరప్ప అనే నేను..." అంటూ ఆయన ప్రమాణ స్వీకారం కన్నడలో సాగింది.

పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం ముగిసింది. ఆపై ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ శ్రేణులు యడ్యూరప్పకు, బీజేపీకి జయజయధ్వానాలు పలికాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు యడ్యూరప్ప రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Yedeyurappa
Oath
Karnataka
Cm
Governer
  • Loading...

More Telugu News