Tej Pratap Yadav: భార్యను సైకిలెక్కించుకుని తిప్పిన తేజ్ ప్రతాప్ యాదవ్... చూడండి!

  • గత శనివారం పెళ్లి చేసుకున్న తేజ్ ప్రతాప్
  • వైభవంగా జరిగిన పెళ్లి వేడుక
  • కొత్త భార్యను సైకిల్ ఎక్కించుకున్న తేజ్
  • వైరల్ అవుతున్న ఫొటోలు

గత వారాంతంలో తాను వివాహమాడిన బీహార్ మాజీ సీఎం ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్ ని, తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ ఎక్కించి తిప్పారు. ఆ చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 12వ తేదీ శనివారం వీరి వివాహం పట్నాలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి తాత్కాలిక బెయిల్ పై లాలూ ప్రసాద్ యాదవ్ రాగా, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తె మీసా భారతి తదితరులు ఎంతో ఆనందంగా నృత్యాలు చేస్తూ వివాహ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక తన ఇంట్లో సైకిల్ ఎక్కి, కొత్త భార్యను ముందు కూర్చోబెట్టుకున్న తేజ్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటిని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పంచుకున్నారు.

Tej Pratap Yadav
Patna
Marriage
Bicycle
Aishwarya Rai
  • Error fetching data: Network response was not ok

More Telugu News