raj bhavan: రాజ్‌భవన్‌ చేరుకున్న కుమారస్వామి.. అడ్డుకున్న సిబ్బంది

  • రాజ్‌భవన్‌ వద్దకు కాంగ్రెస్‌ నేతలు కూడా
  • ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలంటోన్న జేడీఎస్‌
  • కొనసాగుతోన్న ఉత్కంఠ

కాంగ్రెస్‌తో కలిసి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుంటోన్న జేడీఎస్‌ నేత కుమార స్వామి ఈ రోజు మరోసారి తమ రాష్ట్ర గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను కలవడానికి రాజ్‌భవన్‌ వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ షాక్ తగిలింది. కుమారస్వామిని రాజ్‌భవన్‌ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కుమారస్వామి కోరాలనుకుంటున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ మొదట ఎవరికి అనుమతి ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.    

raj bhavan
kumara swamy
  • Loading...

More Telugu News