roja: బాలిక‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతుంటే ఈ ప్ర‌భుత్వానికి సిగ్గు లేదా?: రోజా

  • చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్ లు
  • మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణ
  • ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్ లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ, వారి రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రోజా ఆరోపించారు. దాచేప‌ల్లి ఘ‌ట‌నే చివ‌రి ఘ‌ట‌న అవుతుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు నిన్న పాత గుంటూరులో బాలిక‌పై జరిగిన అత్యాచారం గురించి సమాధానం చెప్పాలని, త‌క్ష‌ణ‌మే ఆ బాలిక‌కు ఆర్థిక స‌హాయం చేయాలని డిమాండ్ చేశారు.

 ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, టోల్ ఫ్రీ నెంబ‌ర్లు పెడ‌తామ‌ని, మ‌హిళా అధికారుల‌తో ర‌క్ష‌ణ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామని చెబుతున్న చంద్రబాబు వాటిని ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని అన్నారు. దాచేప‌ల్లిలో బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేసిన చంద్ర‌బాబు ఆ త‌రువాత జ‌రిగిన అత్యాచారాల‌పై ఎందుకు స్పందించ‌లేదు?.. ఇప్ప‌టి వ‌ర‌కు 900 మందిపై అత్యాచారాలు జ‌రిగితే ఈ ముఖ్యమంత్రి వాళ్లంద‌రికీ ఎందుకు ప‌రిహారం ఇవ్వ‌లేదు?.. గుంటూరులో 40 రోజుల్లో సుమారు 10 మంది బాలిక‌ల‌పై ఇలా అత్యాచారాలు వ‌రుస‌గా జ‌రుగుతుంటే ఈ ప్ర‌భుత్వానికి సిగ్గు లేదా? అంటూ ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News