ration portability: దేశంలో రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు... రేషన్ పోర్టబులిటీ త్వరలోనే

  • పైలట్ ప్రాజెక్టుగా తొలుత కొన్ని రాష్ట్రాల్లో అమలు
  • వాటిలో ఏపీ, తెలంగాణ, గుజరాత్, హర్యానా
  • అనంతరం దేశవ్యాప్తంగా అమల్లోకి

జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు కూడా పయనమయ్యే వారు ఎందరో ఉన్నారు. ఎన్నో కారణాలతో తమ సొంత రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి వెళ్లి నివసించే వారూ ఉన్నారు. వీరందరికీ త్వరలోనే ఊరట కలగనుంది. తమ రేషన్ కార్డుపై ఏ రాష్ట్రంలో అయినా రేషన్ సరుకులు పొందే వీలు కలగనుంది. రేషన్ పోర్టబులిటీ సదుపాయం అందుబాటులోకి వస్తోంది.

తొలుత తెలంగాణ, ఏపీ, గుజరాత్, హర్యానా రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ముందుగా ఈ రాష్ట్రాల్లో పోర్టబులిటీ అమలు చేస్తారు. అమలులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి సరిచేసిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమల్లోకి తెస్తారు. అంటే అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట రేషన్ కార్డు ఉన్న వారు మరో చోట పొందే అవకాశం ఉందన్నమాట.  తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఇప్పటికే రేషన్ పోర్టుబులిటీ ఉంది. తాము నివాసం ఉంటున్న ప్రాంతం పరిధిలోని చౌక ధరల దుకాణంలో పేరు, కార్డు నంబర్ నమోదు చేసుకుంటే సరిపోతుంది. ప్రతి నెలా అక్కడ నుంచే సరుకులు పొందొచ్చు. 

  • Loading...

More Telugu News