Karnataka: జేడీఎస్ క్యాంప్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్!

  • బెంగళూరులో భేటీ అయిన జేడీఎస్ శాసనసభాపక్షం
  • దీనికి రాజా వెంకటప్పనాయక్, వెంకటరావు నడగౌడ డుమ్మా
  • దీంతో జేడీఎస్ వర్గాల్లో పెరిగిపోయిన ఆందోళన

కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడడంతో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. 104 సీట్లతో మొదటి స్థానంలో ఉన్న బీజేపీ ప్రధాన పక్షాలైన జేడీఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తులకు గాలం వేసి సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రాంగాలు, వ్యూహాలను అమల్లో పెట్టేసింది. దీంతో  కాంగ్రెస్-జేడీఎస్ పక్షాల్లో ఆందోళన నెలకొంది. బీజేపీ పాచికలను చిత్తు చేసేందుకు అవి తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు బెంగళూరులో జేడీఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. దీనికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజా వెంకటప్ప నాయక్, వెంకటరావు నడగౌడలు కనిపించకుండాపోయారు. బెంగళూరులోని ఓ హోటల్లో జేడీఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగుతోంది. ఇద్దరు అదృశ్యం కావడంతో జేడీఎస్ లో ఆందోళన మరింత పెరిగిపోయింది. అటు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇస్తారన్న ఆశతో ఇరు వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

  • Loading...

More Telugu News