BJP: జేడీఎస్ తో పొత్తా?.. అలాంటిదేం ఉండదు: బీజేపీ నేత సదానందగౌడ

  • ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటాం
  • స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు

కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడుతున్నాయి. స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ దూసుకుపోతున్న తరుణంలో... ఆ పార్టీ నేతల స్వరాలు కూడా మారుతున్నాయి. హంగ్ వచ్చే పరిస్థితుల్లో జేడీఎస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా యోచించిన ఆ పార్టీ నేతలు... తాజా ట్రెండ్స్ తో మాట మార్చారు.

బీజేపీ నేత సదానంద గౌడ మాట్లాడుతూ, తమకు ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదని, తామే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ అయ్యామని తెలిపారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే తాము అధికారాన్ని చేపట్టబోతున్నామని ఇంతకు ముందే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా చెప్పారు. 

BJP
jds
sadananda gowda
amit shah
  • Loading...

More Telugu News