Congress: ఇంత బీజేపీ హవాలోనూ నాలుగో స్థానానికి పరిమితమైన నటుడు సాయికుమార్... కారణమేమిటంటే..!

  • యడ్యూరప్ప ఇంటి ముందు ధర్నా చేసి టికెట్ పొందిన సాయికుమార్
  • స్థానికేతరుడు కావడంతో ఆదరించని బాగేపల్లి ప్రజలు
  • బాగేపల్లిలో విజయం దిశగా కాంగ్రెస్

తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వాల్సిందేనంటూ యడ్యూరప్ప ఇంటి ముందు తన అనుచరులతో ధర్నా నిర్వహించి, బాగేపల్లి టికెట్ పొందిన నటుడు సాయికుమార్, బీజేపీ హవా కొనసాగిన ఎన్నికల్లోనూ విజయాన్ని రుచి చూడలేకపోయారు. ఆయన నాలుగో స్థానంలో ఉన్నారని తెలుస్తోంది.

బాగేపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడిన సుబ్బారెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుండగా, జేడీఎస్ అభ్యర్థి మనోహర్ అతనికి సమీపంలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి శ్రీరామిరెడ్డి మూడో స్థానంలో ఉండగా, సాయికుమార్ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. ఇక స్థానికుడికి టికెట్ ఇవ్వలేదన్న ఇక్కడి ప్రజల ఆగ్రహమే సాయికుమార్ పాలిట శాపమైందని తెలుస్తోంది. ఆయన్ను ఓటర్లు ఆదరించకపోవడానికి కారణం ఇదేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Congress
Saikumar
BJP
Karnataka
  • Loading...

More Telugu News