BJP: కాంగ్రెస్ ఆశలపై నీళ్లు... అతిపెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ!

  • 107 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
  • బెంగళూరులో మినహా మరెక్కడా ప్రభావం చూపని కాంగ్రెస్
  • సంబరాలు ప్రారంభించిన బీజేపీ నేతలు

కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి, కనీసం జేడీఎస్ మద్దతుతోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆశలపై కన్నడిగులు నీళ్లు కుమ్మరించారు. ఒక్క బెంగళూరు ప్రాంతంలో మినహా మరెక్కడా కాంగ్రెస్ హవా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తున్న వేళ, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకువెళుతోంది.

జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆ పార్టీ చేరుతుందని అంచనా. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమై ట్రెండ్స్ వెలువడుతుండగా, బీజేపీ 107 చోట్ల, కాంగ్రెస్ 71 చోట్ల, జేడీఎస్ 42 చోట్ల, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నాయన్న ఆనందంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు ప్రారంభించారు. 

BJP
Congress
JDS
Karnataka
Elections
  • Error fetching data: Network response was not ok

More Telugu News