Badami: పోటీ చేసిన రెండు చోట్లా సిద్ధరామయ్య వెనుకంజ!

  • అటు బాదామిలో, ఇటు చాముండేశ్వరిలో వెనుకబడ్డ సిద్ధరామయ్య
  • బాదామిలో ఆధిక్యంలో ఉన్న శ్రీరాములు
  • దేవనాగరిలో ఖర్గే కుమారుడి ఆధిక్యం

కన్నడనాట రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు చోట్లా వెనుకంజలో ఉన్నట్టు తొలి ఫలితాల సరళి తెలుపుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బాదామిలో సిద్ధరామయ్యపై శ్రీరాములు ఆధిక్యంలో ఉన్నారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడ్డ శ్రీరాములు, ప్రస్తుతానికి స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నప్పటికీ, అదే కొనసాగితే, ఈ నియోజకవర్గ ఫలితం సంచలనమే. ఇక సిద్ధరామయ్య పోటీ పడిన చాముండేశ్వరిలో సైతం ఆయన వెనుకబడి ఉండటం గమనార్హం. ఇక దేవనాగరి (ఉత్తర) నియోజకవర్గంలో మల్లికార్జున ఖర్గే కుమారుడు, కనకపురాలో డీకే శివకుమార్ ఆధిక్యంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Badami
Chamundeshwari
Sriramulu
Karnataka
Election
Results
  • Loading...

More Telugu News