Mahanati: ఖర్చు లెక్కపెట్టకుండా సినిమా తీస్తే... లెక్కించలేనన్ని కలెక్షన్లు వస్తాయని నిరూపణ అయింది: 'మహానటి'కి అల్లు అరవింద్ ప్రశంస

  • ఈ సినిమాను అశ్వనీదత్, స్వప్న, ప్రియాంకలే తీయగలరు
  • ఇండస్ట్రీ స్థాయిని పెంచిన 'మహానటి'
  • నిర్మాత అల్లు అరవింద్

'మహానటి' వంటి సినిమాను అశ్వనీదత్, స్వప్న, ప్రియాంకలు తప్ప మరెవరూ తీయలేరని, తెలుగు సినిమా స్థాయిని 'బాహుబలి' తరువాత మరింతగా పెంచిన చిత్రం ఇదని నిర్మాత అల్లు అరవింద్ పొగడ్తల వర్షం కురిపించారు. 'మహానటి' టీమ్ కు డిన్నర్ పార్టీ ఇచ్చిన ఆయన, సినిమాకు పెట్టే ఖర్చును లెక్కపెట్టకుండా తీస్తే, లెక్కించలేనన్ని కలెక్షన్లను కళ్లజూడవచ్చని నిరూపించిన చిత్రం ఇదని, ఈ సినిమాకు వెలకట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు.

హిట్ అయ్యే సినిమాలు చాలానే వస్తుంటాయని, అయితే, ఇండస్ట్రీ స్థాయిని పెంచే ఇటువంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయని చెప్పారు. జెమినీ గణేశన్, సావిత్రిల ప్రేమకథను 'దేవదాసు' సినిమాతో లింక్ పెట్టడం, ఆమె మద్యం అలవాటు చేసుకునే సన్నివేశాలను హృద్యంగా చెప్పడం తనకెంతో నచ్చాయని అన్నారు. ఈ పార్టీకి సినిమా నటీనటులతో పాటు రాజమౌళి, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ తదితరులు హాజరయ్యారు.

Mahanati
Aswanidutt
Swapna
Priyanka
  • Loading...

More Telugu News