charan: బ్యాంకాక్ లో చరణ్.. యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్న బోయపాటి!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • నిర్మాతగా డీవీవీ దానయ్య 
  • 15 రోజుల పాటు బ్యాంకాక్ లో షూటింగ్    

బోయపాటి దర్శకత్వంలో చరణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ను నిర్ణయించని ఈ సినిమాలో ఆయన జోడీగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ను ఇటీవలే హైదరాబాద్ లో చిత్రీకరించారు. చరణ్ పై ఒక యాక్షన్ ఎపిసోడ్ తో ఆ షెడ్యూల్ ను పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, ఈ నెల 12వ తేదీ నుంచి బ్యాంకాక్ లో షూటింగును ప్లాన్ చేశారు.

దాదాపు 15 రోజుల పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 'రంగస్థలం' భారీ విజయం తరువాత, బోయపాటి ముందుగా చెప్పిన స్క్రిప్ట్ లో చరణ్ కొన్ని మార్పులు .. చేర్పులు సూచించినట్టుగా వినికిడి. ఈ సినిమాలో చరణ్ తో కలిసి తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేయనుండటం విశేషం.    

  • Loading...

More Telugu News