vishal: నాకు దక్కిన గొప్ప వరం వరలక్ష్మి: విశాల్

  • ఎనిమిదేళ్లుగా వరలక్ష్మి నాకు తెలుసు
  • అన్ని విషయాలను ఆమెతో పంచుకుంటా
  • ఆమెకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ

ప్రముఖ నటుడు, రాజకీయవేత్త అయిన శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, హీరో విశాల్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మీడియాలో కూడా వీరి ప్రేమకు సంబంధించిన అనేక వార్తలు వచ్చాయి. అయితే, ఏరోజు కూడా ఆ వార్తలను వీరిద్దరూ ధ్రువీకరించలేదు, ఖండించలేదు. అయితే వీరిద్దరూ కలసి తరచుగా బయట కనిపిస్తుంటారు.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన 'మిస్టర్ చంద్రమౌళి' సినిమా ఆడియో వేడుకకు విశాల్, వరలక్ష్మిలు హాజరయ్యారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. వీరి కలయిక సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయింది. ఇటీవల ఓ తమిళ పత్రికతో విశాల్ మాట్లాడుతూ వరలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పాడు. తన జీవితంలో స్నేహితులకు ఉన్నత స్థానం ఉంటుందని, మనలోని మంచి, చెడులను కరెక్ట్ గా చెప్పేది వారేనని అన్నాడు. వరలక్ష్మి కూడా అంతేనని చెప్పాడు. తన జీవితంలో తనకు దక్కిన గొప్ప వరం వరలక్ష్మి అని చెప్పాడు. ఎనిమిదేళ్లుగా ఆమె తనకు తెలుసని... తనకు సంబంధించిన అన్ని విషయాలను ఆమెతో పంచుకుంటానని తెలిపాడు. వరలక్ష్మికి ఆత్మవిశ్వాసం ఎక్కువని, ఆమె రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించాడు. 

vishal
varalakshmi
kollywood
love
affair
  • Loading...

More Telugu News