notrh korea: అణ్వస్త్ర పరీక్షలను ఈ నెలలోనే నిలిపి వేయనున్న ఉత్తర కొరియా!
- అణ్వస్త్ర వేదికలను కూడా ధ్వంసం చేస్తాం
- ఈ నెల 23, 25 తేదీల్లో ఈ పని చేస్తాం
- విదేశీ మీడియా సంస్థల సమక్షంలో వీటిని మూసివేస్తాం
- ఉత్తర కొరియా అధికారులు
తమ దేశంలో అణ్వస్త్ర పరీక్షలను ఈ నెలలోనే నిలిపివేయాలని, ఈ పరీక్షలు నిర్వహించే అణ్వస్త్ర వేదికలను కూడా ధ్వంసం చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. విదేశీ మీడియా సంస్థల సమక్షంలో ఈ నెల 23, 25 తేదీల్లో ఈ పని చేయనున్నట్టు ఉత్తర కొరియా అధికారులు పేర్కొన్నారు.
అయితే, తమ దేశంపై అగ్రరాజ్యం అమెరికా దాడులకు పాల్పడమని హామీ ఇస్తే అణ్వస్త్రాలను పక్కనబెడతామని చెప్పారు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, దక్షిణ కొరియా దేశాల మీడియా చూస్తుండగా అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్టు చెప్పారు. కాగా, ఉత్తర, దక్షిణ కొరియాలలో ఒకే సమయం ఉండాలని భావించిన కిమ్, తమ దేశ సమయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే.