Allu Arjun: తన అభిమాని మృతితో అల్లు అర్జున్ ఆవేదన!

  • అల్లు అర్జున్ అభిమాని దేవసాయి గణేశ్ మృతి
  • ఈ వార్త విని నా గుండె పగిలిపోయింది
  • అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి

ప్రముఖ హీరో అల్లు అర్జున్ అభిమాని దేవసాయి గణేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కొంత కాలంగా బోన్ కేన్సర్ తో బాధపడుతున్న అతను మృతి చెందడంపై అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సాయి గణేశ్ మృతి వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి’ అని ఆ పోస్ట్ లో బన్నీ సంతాపం వ్యక్తం చేశాడు.

కాగా, విశాఖపట్ణణం జిల్లా అనకాపల్లికి చెందిన దేవసాయి గణేశ్ కొన్నాళ్లుగా బోన్ కేన్సర్ తో బాధపడ్డాడు. అల్లు అర్జున్ అంటే ఆ చిన్నారికి చాలా ఇష్టం. బన్నీని చూడాలనేది తన చివరి కోరికని దేవసాయి చెప్పడంతో ఇటీవలే అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి చూసొచ్చాడు. 

Allu Arjun
deva sai ganesh
demise
condolences
  • Loading...

More Telugu News