senior citizens: తల్లిదండ్రులను వేధిస్తే ఇకపై ఆరు నెలల జైలు శిక్ష... చట్టాన్ని సవరించనున్న కేంద్రం
- తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే జైలుకే
- ప్రస్తుతం మూడు నెలల జైలు శిక్ష
- దీన్ని ఆరు నెలలకు పెంచుతూ చట్టంలో సవరణ ప్రతిపాదన
తల్లిదండ్రుల పట్ల నిర్దయగా ఉండేవారు, క్రూరంగా వ్యవహరించే వారికి గడ్డు రోజులు ముందున్నాయి. తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసే వారు, పెద్దలను వేధించే వారికి ప్రస్తుతం మూడు నెలల వరకు జైలు శిక్ష విధించేందుకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ శిక్షను ఆరు నెలలకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
అలాగే, పెద్దలకు జీవన వ్యయం చెల్లించని సంతానానికి నెల వరకు జైలు శిక్ష విధించే అధికారాన్ని ట్రైబ్యునళ్లకు కల్పించాలనుకుంటోంది. ఈ మేరకు సవరణలను సీనియర్ సిటిజన్స్ యాక్ట్, 2007కు కేంద్రం ప్రతిపాదించింది. ఈ ముసాయిదా బిల్లుపై అభిప్రాయలు, సూచనలను తెలియజేయాలని కోరుతూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది.