Nagarjuna: పవన్ కల్యాణ్ విషయంలో శ్రీరెడ్డిని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు?: రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇది!

  • మొత్తం వ్యవహారంపై వీడియో వివరణ ఇచ్చా
  • కావాలంటే యూట్యూబ్ లో చూసుకోవచ్చు
  • వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ

తాజాగా అక్కినేని నాగార్జునతో 'ఆఫీసర్' సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో, పవన్ కల్యాణ్ ను విమర్శించేందుకు శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకోవడం ఎందుకన్న ప్రశ్న ఎదురైంది. ఎవరినైనా తిట్టగల రామ్ గోపాల్ వర్మకు, శ్రీరెడ్డికి ఉన్న సంబంధం ఏంటని, మీకు సంబంధించిన వీడియోలు ఆమె వద్ద ఉన్నాయా? అంటూ ప్రశ్నించగా, ఈ మొత్తం వ్యవహారం గురించిన తన వివరణను యూట్యూబ్ లో పోస్టు చేశానని వర్మ సమాధానం చెప్పారు.

ఈ వ్యవహారంపై ఎవరికైనా ఆసక్తి ఉంటే తన వీడియోను చూసుకోవచ్చని అన్నారు. తాను ఎన్నడూ దేనికీ కూడా విచారాన్ని వ్యక్తం చేయబోనని, ముందుకు వెళుతూ ఉండటమే తన కర్తవ్యమని అన్నారు. ఇక వర్మ కామెంట్లతో తాను ఫీల్ అయినట్టు పూరీ జగన్నాథ్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, కామెంట్లు చేయడం తన హక్కని, ఫీల్ కావడం పూరీ హక్కని వ్యాఖ్యానించారు. తాను చెప్పేవాటిని అర్థం చేసుకోలేని వాళ్లే తనను సైకో అని, పర్వర్ట్ అని అంటుంటారని, వాటిని గురించి పట్టించుకోబోనని స్పష్టం చేశారు.

Nagarjuna
Ramgopal Varma
Pawan Kalyan
Srireddy
  • Loading...

More Telugu News