Varla Ramaiah: ప్రయాణికుడిపై అనుచిత వ్యాఖ్యలకు... విచారం వ్యక్తం చేసిన వర్ల రామయ్య!

  • మచిలీపట్నం బస్టాండ్ లో వర్ల రామయ్య తనిఖీలు
  • ఆయన్ను పట్టించుకోని ఓ దళిత విద్యార్థి
  • కులం పేరుతో దూషించిన వర్ల
  • విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన జారీ

మచిలీపట్నం బస్టాండ్‌ లో తనిఖీలు నిర్వహిస్తున్న వేళ, బస్సులో తనను పట్టించుకోకుండా కూర్చుని ఉన్న ఓ దళిత విద్యార్థిపై పరుష పదజాలాన్ని ఉపయోగించి, కులం గురించి మాట్లాడి దూషించినందుకు గాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

షెడ్యూ ల్‌ కులాల్లో భాగమైన మాదిగ జాతి సమాజంలో వెనుకబడి ఉందని, సదరు విద్యార్థి వ్యవహారంతో తాను బాధపడినందున మందలించానే తప్ప, మరే దురుద్దేశమూ లేదని తెలిపారు. తాను విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరుతో తన వర్గం వారి మనసు బాధ పెట్టినట్లు తెలిసిందని, ఇందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటానని అన్నారు.

Varla Ramaiah
Machilipatnam
RTC Busstand
SC ST
  • Loading...

More Telugu News