Vijayanagaram District: 'భర్తను చంపించిన భార్య' కేసులో... ప్రియుడు శివ అరెస్ట్!

  • విజయనగరం జిల్లాలో కలకలం రేపిన హత్య
  • పెళ్లయిన పది రోజులకే భర్తను చంపించిన యువతి
  • పోలీసుల అదుపులో కీలక సూత్రధారి శివ

విజయనగరం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన కొత్త పెళ్లి కొడుకు హత్య కేసులో వధువు ప్రియుడు శివ అలియాస్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తనకు ఇష్టం లేని వివాహం చేశారన్న ఆగ్రహంతో, పెళ్లయిన పది రోజులకే తన భర్తను ప్రియుడితో కలసి సరస్వతి అనే యువతి హత్య చేయించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే సరస్వతి సహా హత్యలో భాగం పంచుకున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కీలక సూత్రధారి శివను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఈ కేసును సీరియస్ గా తీసుకుని శివ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, వారు ఓ పథకం ప్రకారం శివను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అరెస్ట్ చేసిన శివను పార్వతీపురం తరలించి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Vijayanagaram District
Police
Murder
Bride
Bridegroom
  • Loading...

More Telugu News