Tollywood: టైమ్ వచ్చినప్పుడు అవే వస్తాయి: రామ్ గోపాల్ వర్మ

  • 10 సినిమాల వరకూ ఎనౌన్స్ చేశా
  • పని అయిపోయిందనుకున్న వారికి 'ఆఫీసర్' సమాధానం
  • రెండు నెలల్లో అఖిల్ తో సినిమా

గతంలో తాను ఎనౌన్స్ చేసిన సినిమాలు ఓ 10 వరకూ ఉన్నాయని, అవన్నీ సమయం వచ్చినప్పుడు వాటంతట అవే వస్తాయని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. అక్కినేని నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన 'ఆఫీసర్' విడుదలకు సిద్ధం కాగా, సినిమా ప్రమోషన్ నిమిత్తం ఓ దినపత్రికతో మాట్లాడిన ఆయన, తనకు చిన్నప్పటి నుంచి వివాదం నిండిన సబ్జెక్టులంటే ఇష్టమని అన్నారు.

తన వెనుక దేవుడున్నాడని, అందువల్లే ఎవరినైనా విమర్శించే ధైర్యం తనకు సొంతమని అన్నారు. "వర్మ పని అయిపోయింది" అని అనుకునే వాళ్లకు సమాధానం చెప్పాలనే 'ఆఫీసర్' తీశానని, ఈ సినిమా ట్రైలర్ కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడానికి గల కారణాలు ఏంటో పవన్ కల్యాణ్ అభిమానులను అడగాలని అన్నారు. ప్రస్తుతం తన వద్ద తనకు సరిపడినంత డబ్బు ఉందని, అఖిల్ తో తాను ప్రకటించిన సినిమా రెండు నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు.

Tollywood
Ramgopal Varma
Nagarjuna
Akhil
Officer
  • Loading...

More Telugu News