: కొండా దంపతులకు బీజేపీ గాలం
అటు సొంత పార్టీ కాంగ్రెస్ కు దూరమై, ఇటు వైఎస్సార్సీపీలో ఇమడలేక కొంగొత్త రాజకీయ వేదిక కోసం అన్వేషిస్తున్న కొండా సురేఖ దంపతులకు బీజేపీ గాలం వేస్తోంది. బీజేపీ రాష్ట్ర నేత కిషన్ రెడ్డి ఈ విషయమై స్పందించారు. కొండా దంపతులు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం కొండా దంపతులతో వరంగల్ జిల్లా బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.