amit shah: అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి జరగలేదు!: డీజీపీ వివరణ

  • కాన్వాయ్ లోని ఏడో కారు కొంచెం నెమ్మదిగా వెళ్లింది
  • సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కర్రతో అద్దం పగలగొట్టారు
  • కేసు నమోదు చేశాం.. ఒకరిని అరెస్ట్ చేశాం

అలిపిరి ఘటనపై ఏపీ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కాన్వాయ్ లోని ఏడో కారు అలిపిరి వద్ద కొద్దిగా స్లోగా వెళ్లిందని... ఈలోగా సుబ్రహ్మణ్యం అనే వక్తి కర్రతో కారు అద్దం పగలగొట్టారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారని చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఒకర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని... పోలీసు సిబ్బంది తప్పుందని తేలినా చర్యలు తప్పవని తెలిపారు. అలిపిరి ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ డీజీపీ ఈ మేరకు స్పందించారు.

amit shah
dgp
malakondaiah
alipiri
somu veerraju
  • Loading...

More Telugu News