somu veerraju: సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండించిన గంటా శ్రీనివాసరావు

  • చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న సోము వీర్రాజు
  • అలిపిరి ఘటన ప్రణాళిక ప్రకారం జరిగింది కాదన్న గంటా
  • మోదీ, అమిత్ షానే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్

అలిపిరిలో అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడి చంద్రబాబుకు తెలిసే జరిగిందని, ఆయన క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీర్రాజు చేసిన వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. అలిపిరి ఘటనను చంద్రబాబు ఖండించారని, ఘటనకు పాల్పడినవారు ఎవరైనా సరే చర్యలు తప్పవంటూ హెచ్చరించారని గంటా తెలిపారు. ఈ ఘటన ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఆవేదనను అలిపిరి ఘటన వ్యక్తీకరిస్తోందని అన్నారు. మోసం చేసిన మోదీ, అమిత్ షానే ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

somu veerraju
Ganta Srinivasa Rao
Chandrababu
amit shah
Narendra Modi
alipiri
  • Loading...

More Telugu News