charan: చరణ్ తో బోయపాటి .. డబ్బింగ్ హక్కులకుగాను 21 కోట్లు!

  • షూటింగు దశలో బోయపాటి మూవీ
  • చరణ్ సరసన కైరా అద్వాని 
  • ఐటమ్ చేయనున్న తమన్నా

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రోజు నుంచి ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చరణ్.. కైరా అద్వాని తదితరులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను .. ఒకటి రెండు పాటలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ అనువాద హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.ఓ నార్త్ ఇండియా కంపెనీ వాళ్లు ఈ సినిమా హిందీ అనువాద హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో నాయాకా నాయికలైన చరణ్ .. కైరా అద్వాని ఇద్దరూ కూడా హిందీ ప్రేక్షకులకు సుపరిచితులే. ఇక ఈ సినిమాలో విలన్ గా చేస్తోన్న వివేక్ ఒబెరాయ్ కి .. ఐటమ్ సాంగ్ చేస్తోన్న తమన్నాకి కూడా హిందీలో మంచి క్రేజ్ వుంది. ఈ కారణంగానే ఈ సినిమా హిందీ అనువాద హక్కులు ఈ స్థాయి రేటుకు అమ్ముడుపోయాయని అంటున్నారు.  

  • Loading...

More Telugu News