Karnataka ELECTIONS: కర్ణాటక ఎన్నికలకు ముచ్చట గొలిపే ఏర్పాట్లు... ఆకట్టుకుంటోన్న పోలింగ్ బూత్ లు
- పూర్తిగా మహిళలు నిర్వహించే బూత్ లు
- వికలాంగుల నిర్వహణలో 13 బూత్ లు
- గిరిజన గుడారాలను తలపించే బూత్ లు
- ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పోలింగ్ బూత్ లను సుందరంగా ఏర్పాటు చేసి ఓటర్లను వాటి వరకూ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
పింక్ బూత్ లు
అధికారులు, సిబ్బంది, అబ్జర్వర్లు, భద్రతా సిబ్బంది ఇలా అందరూ మహిళలలో కూడిన సఖి పోలింగ్ బూతులను 450 చోట్ల ఏర్పాటు చేసింది.
సంప్రదాయ బూత్ లు
స్థానిక గిరిజన సంప్రదాయాన్ని పోలిన నిర్మాణంలో మైసూరు, చామరాజనగర్ లో సుమారు 28 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
వికలాంగులకు
112 మంది వికలాంగ ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ విధుల్లో పాల్గొంటుండగా, 13 పోలింగ్ బూత్ లను పూర్తిగా వీరే నిర్వహించేలా చర్యలు తీసుకుంది.
ఎన్నికల గీతం
మొదటిసారిగా ఎన్నికల గీతాన్ని కూడా ఆవిష్కరించింది. దర్శకుడు యోగరాజ్ భట్ ఆధ్వర్యంలో ఈ గీతం వీడియో రూపం దాల్చింది.
అభ్యర్థుల ఫొటోలు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అభ్యర్థుల ఫోటోలను ఈ విడత ఏర్పాటు చేశారు. దీనివల్ల అభ్యర్థుల విషయంలో ఓటర్లు పొరబడే అవకాశం ఉండదని ఈసీ భావిస్తోంది.
అత్యాధునిక ఈవీఎంలు
ఈ ఎన్నికల్లో మూడో జనరేషన్ ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదని, వీటిని ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే పనిచేయకుండా నిలిచిపోతాయని ఈసీ తెలిపింది.