mamata benarjee: నన్ను చంపేందుకు కుట్ర... సుపారీ కూడా ఇచ్చారు: మమతా బెనర్జీ సంచలన ఆరోపణ

  • ఓ రాజకీయ పార్టీ కిరాయి హంతకులను నియమించుకుంది
  • నా నివాసం, కార్యాలయం సమీపంలో రెక్కీ నిర్వహించారు
  • తనకివి అలవాటైపోయయాని ప్రకటన

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన హత్యకు కుట్ర జరిగిందని సంచలన ఆరోపణ చేశారు. తనను అంతమొందించేందుకు ఓ రాజకీయ పార్టీ కిరాయి హంతకులను కూడా నియమించుకుందన్నారు.

‘‘నన్ను చంపేందుకు కుట్ర జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. ఇందుకోసం ఓ పార్టీ సుపారీ కూడా ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న కిరాయి హంతకులు నా నివాసం, కార్యాలయం, ఇతర సమీప ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు’’ అంటూ జీ24 చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ చెప్పారు. కుట్రదారులు రోజూ తనను దూషిస్తూ ముందు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, ఆ తర్వాత శాశ్వతంగా తనను తొలగించే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. అయితే, తనకు ఇవి అలవాటైపోయాయని, గతంలో కుట్రల నుంచి తాను ప్రాణాలతో బయపడ్డానన్నారు.

mamata benarjee
  • Loading...

More Telugu News