madhusudana chary: నన్ను ఓడించిన వారికి క్షీరాభిషేకం చేసి, స్వర్ణకంకణం తొడుగుతా: స్పీకర్ మధుసూదనాచారి

  • నియోజకవర్గంలో ఊర్ల పేర్లు తెలియనివారు కూడా మాట్లాడుతున్నారు
  • వారి మాటలు విని మోసపోవద్దు
  • నా గెలుపును ఎవరూ అడ్డుకోలేరు

భూపాలపల్లి నియోజకవర్గంలో కనీసం ఊర్ల పేర్లు కూడా తెలియని కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మండిపడ్డారు. ఇలాంటివారు చేసే తాటాకు చప్పుళ్లకు తాను బెదరనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

ఒకవేళ తనను ఎవరైనా ఓడిస్తే... వారికి క్షీరాభిషేకం చేసి, స్వర్ణకంకణం తొడుగుతానని చెప్పారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, తెలంగాణను సాధించుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదని తెలిపారు. తెలంగాణలో గత 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని తాము కేవలం నాలుగేళ్లలో చేసి చూపించామని చెప్పారు. కొంత మంది నాయకులు చెబుతున్న మాటలను విని మోసపోవద్దని కోరారు. 

madhusudana chary
bhupalapalli
  • Loading...

More Telugu News