Hyderabad: సికింద్రాబాద్‌లో యువకుడి హల్‌చల్‌.. పదునైన ఆయుధంతో పూజారి, కాపాలాదారుడిపై దాడి

  • సిక్కు విలేజ్‌ జైనమందిర్‌ వద్ద ఘటన
  • కారు పార్కింగ్‌ విషయంలో గొడవ
  • కారు పక్కకు తీయమన్నందుకు దాడి  

సికింద్రాబాద్‌లో ఓ యువకుడు హల్‌ చల్ చేశాడు. సిక్కు విలేజ్‌ జైనమందిర్‌ వద్ద ఇద్దరితో గొడవపెట్టుకుని వారిని తీవ్ర గాయాలపాలు చేశాడు. వివరాల్లోకి వెళితే, సిక్కు విలేజ్‌ జైనమందిర్‌ వద్ద కారు పార్కింగ్‌ విషయంలో ఆ యువకుడు కాపలాదారుడితో గొడవపడ్డాడు. ఆ యువకుడిని కారు పక్కకు తీయమని కాపాలదారుడితో పాటు పూజారి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు.. ఓ పదునైన ఆయుధంతో దాడికి దిగాడు. దీంతో వారిద్దరికీ తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.   

  • Loading...

More Telugu News