Maharashtra: తుపాకితో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి హిమాన్షు ఆత్మహత్య!

  • ముంబయిలోని మలబార్ హిల్స్‌లో ఘటన
  • కేన్సర్‌తో బాధపడుతోన్న హిమాన్షు
  • కొంత కాలంగా మెడికల్ లీవ్‌లో ఉన్న అధికారి

ముంబయి, మలబార్ హిల్స్‌లోని తన నివాసంలో తుపాకీతో నోట్లో కాల్చుకుని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ మాజీ చీఫ్ హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. రెండేళ్లుగా బోన్ కేన్సర్‌తో బాధపడుతూ.. ఆయన కొన్ని రోజుల నుంచి మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఆయన మృతదేహం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంది. చోటారాజన్‌కు శిక్షపడిన జ్యోతిడే కేసు దర్యాప్తులో హిమాన్షు కీలక పాత్ర పోషించారు.

1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి అయిన హిమాన్షు.. డిపార్ట్‌మెంటులో అందరితో చాలా కలుపుగోలుతనంగా ఉండేవారు. ఈయన ముంబయి క్రైం బ్రాంచ్ చీఫ్‌గా ఉన్నప్పుడే 26/11 ముంబై ఉగ్రవాద దాడి దోషి, పాకిస్థానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష పడింది. 2013 ఐపీఎల్‌ ఫిక్సింగ్ కేసు దర్యాప్తులోనూ ఈయన కీలక పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News