amit shah: అమిత్ షాపై దాడి అవాస్తవం.. బీజేపీవాళ్లు కొట్టడం వల్ల మా కార్యకర్తలు ఆసుపత్రుల్లో ఉన్నారు!: టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ

  • నల్ల జెండాలతో నిరసన మాత్రమే తెలిపారు
  • అమిత్ షా కాన్వాయ్ వెళ్లిపోయాక.. టీడీపీ కార్యకర్తలపై బీజేపీ దాడి చేసింది
  • జెండా కర్రలతో కొట్టారన్న ఎమ్మెల్యే సుగుణమ్మ

అలిపిరి వద్ద బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి జరిగిందనే వార్తల్లో వాస్తవం లేదని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. కావాలంటే సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించుకోవచ్చని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు కేవలం నల్ల జెండాలతో నిరసన మాత్రమే తెలిపారని, ఆ సమయంలోనే అమిత్ షా కాన్వాయ్ వెళ్లిందని తెలిపారు.

కాన్వాయ్ వెళ్లగానే బీజేపీ నేతలు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. శ్రీకాళహస్తికి చెందిన బీజేపీ నేత కోలా ఆనంద్ అనుచరులు, గడ్డం ఉన్న మరో వ్యక్తి టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని, జెండా కర్రలతో కొట్టారని చెప్పారు. బీజేపీ నేతలు చేసిన పనికి టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

amit shah
sugunamma
attack
alipiri
  • Loading...

More Telugu News