Naa Peru Surya: 'నా పేరు సూర్య' రివ్యూ రాసిన మహిళా జర్నలిస్టుకు ఫ్యాన్స్ బెదిరింపులు!

  • కేరళ సినీ విశ్లేషకురాలు అపర్ణ ప్రశాంతికి అభిమానుల బెదిరింపు
  • అత్యాచారం, హత్య చేస్తామని ఫోన్లు
  • సైబర్ క్రైమ్, డీజీపీకి ఫిర్యాదు చేసిన అపర్ణ

అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'నా పేరు సూర్య' సమీక్షను రాసిన తనకు ఆయన ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని మలయాళ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ అపర్ణ ప్రశాంతి కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ కు కేరళలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, తెలుగుతో పాటు మలయాళంలోనూ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

దీన్ని చూసిన అపర్ణ ప్రశాంతి, సినిమాపై మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. సినిమా బాగాలేదని ఆమె అనడాన్ని సహించలేని ఫ్యాన్స్, తీవ్ర ఆగ్రహంతో ఆమెకు ఫోన్ చేసి అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Naa Peru Surya
Malayalam
Kerala
Aparna Prashanti
Allu Arjun
Fans
  • Loading...

More Telugu News