Pragati Resorts: నన్ను కాదని వేరే అబ్బాయితో తిరుగుతోందనే చంపేశా!: 'ప్రగతి రిసార్ట్స్' హత్య కేసు నిందితుడు సాయిప్రసాద్

  • ప్రగతి రిసార్ట్స్ లో శిరీషను హత్య చేసిన సాయి ప్రసాద్
  • ఆరేళ్లుగా తనతో తిరిగి, ఇప్పుడు మరో యువకుడితో స్నేహం 
  • నిందితుడిని విచారిస్తున్న పోలీసులు

గడచిన ఆరు సంవత్సరాలుగా తనతో కలిసి తిరుగుతూ, ఇప్పుడు వేరే అబ్బాయితో చనువుగా ఉందన్న ఆగ్రహంతోనే శిరీషను హత్య చేశానని సాయిప్రసాద్ అంగీకరించినట్టు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం పథకం ప్రకారం డిగ్రీ విద్యార్థిని శిరీషను హైదరాబాద్ నగర శివార్లలోని ప్రగతి రిసార్ట్స్ కు తీసుకెళ్లిన సాయి ప్రసాద్, అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి దారుణంగా హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఆమె రిఫ్రెష్ అయ్యేందుకు వాష్ రూముకు వెళ్లి, ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకుంటున్న సమయంలో వెనుకనుంచి వచ్చిన సాయి, పదునైన కత్తితో గొంతు కోసి, ఆపై ఛాతీలో పొడిచి హత్య చేశాడు. అంతకుముందు తనను వివాహం చేసుకోవాలని ఆమెను వేడుకున్నానని, అయినా వినలేదని చెప్పాడు. హత్య తరువాత గంటల వ్యవధిలోనే సాయిప్రసాద్ పోలీసులకు పట్టుబడగా, ప్రస్తుతం చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో అతన్ని విచారిస్తున్నారు. తాను ఆమెపై అత్యాచారం ఏమీ చేయలేదని సాయిప్రసాద్ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

Pragati Resorts
Saiprasad
Sirisha
Murder
  • Loading...

More Telugu News