Varla Ramaiah: ప్రయాణికుడిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. వర్ల రామయ్యపై చంద్రబాబు సీరియస్!

  • నిన్న దళిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు
  • విషయం తెలుసుకున్న చంద్రబాబు
  • పార్టీ పరువు తీస్తున్నారని మండిపాటు

నిన్న ఓ దళిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నువ్వు ఎస్సీనా? ఎస్టీనా? అంటూ రామయ్య అడగడం, మాలా? మాదిగా? అనడం, ఆపై రాయడానికి వీలులేని బూతులు వాడటాన్ని టీవీల్లో చూసిన చంద్రబాబు, వెంటనే వర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దళిత నేత అయ్యుండి విద్యార్థిపై ఈ వ్యాఖ్యలేంటని మండిపడ్డ ఆయన, పార్టీ పరువును బజారులో పెట్టవద్దని హెచ్చరించినట్టు సమాచారం. వర్ల వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ఈ తరహా ఘటనలను తాను సహించబోనని హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వర్లపై విపక్ష నేతలతో పాటు దళిత సంఘాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి. జరిగిన ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాయి. నిన్న జరిగిన సంఘటన వీడియోను చూడవచ్చు.

Varla Ramaiah
Chandrababu
APSRTC Chairman
SC ST
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News