Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాంప్లిమెంట్ ను నేనెప్పటికీ మర్చిపోలేను: హీరో రవితేజ

  • ‘మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండి’ అని నాతో పవన్  అన్నారు
  • ఈ కాంప్లిమెంట్ నేనెప్పటికీ మర్చిపోలేను
  • ఇది వరకు ఇధ్దరం బాగానే కలుసుకుంటూ ఉండేవాళ్లం

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం నేలటిక్కెట్టు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన రవితేజ మాట్లాడుతూ, ‘పదేళ్ల క్రితం ఒకరికి నేను ఫోన్ చేశాను. ఆ వ్యక్తి పక్కన పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్.. ‘మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండి?’ అని అన్నారు. ఈ కాంప్లిమెంట్ ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది వరకు ఇధ్దరం బాగానే కలుసుకుంటూ ఉండే వాళ్లం. ఇప్పుడు బిజీ అయిపోవడంతో కలవలేకపోతున్నాం. పవన్ కల్యాణ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇక ‘నేలటిక్కెట్టు’ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అని రవితేజ అన్నాడు. 

  • Loading...

More Telugu News